Thursday, April 18, 2024

ఎమోష‌న్స్ కి దూరంగా ఉండే – ‘ఆర్జీవీ’కి ఫీలింగ్స్ ఉన్నాయ‌ట‌

నిత్యం వివాదాలు, సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిలుస్తూనే ఉంటాడు ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ‌. ఆయన ఏది చేసినా, ఏం మాట్లాడినా ఒక సంచలనమే అవుతుంది. అవతలి వ్యక్తి ఎవరు అనే విషయంతో సంబంధం లేకుండా తన మనసులో ఉన్నదాన్ని ఉన్నట్టు చెప్పడం ఆయన ప్రత్యేకత. మరోవైపు వర్మకు ఎలాంటి ఫీలింగ్స్ లేవని అందరూ అనుకుంటుంటారు. ఆయన కూడా తను ఎలాంటి ఎమోషన్స్, ఫీలింగ్స్ ఉండవని చెప్పుకుంటుంటారు. అయితే తాజాగా ఆయన ఒక ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. ఒక కుక్కను ఎంతో ప్రేమతో దగ్గరకు తీసుకున్న ఫొటోనే షేర్ చేశారు. అంతేకాదు… ‘నాక్కూడా ఫీలింగ్స్ ఉంటాయి’ అని క్యాప్షన్ పెట్టారు. ఈ ఫొటోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement