Tuesday, April 16, 2024

మంత్రి కేటీఆర్ కారును ఆపేసిన పోలీసులు!

రూల్ ఈజ్ రూల్.. రూల్ ఫర్ ఆల్.. అనే నానుడిని హైదరాబాద్ పోలీసులు ఆచరణలో చేసి చూపించారు. ట్రాఫిక్ రూల్స్ ముందు సామాన్యుడైనా… ప్రజాప్రతినిధి అయినా ఒక్కటే అని నిరూపించారు. ఏకంగా మంత్రి కేటీఆర్ కారునే అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళ్లితే.. గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని బాపు ఘాట్‌కు వెళ్లి తిరిగొస్తుండగా మంత్రి కేటీఆర్ కారును స్థానిక ట్రాఫిక్ పోలీసులు ఆపేశారు. 

బాపూజీ ఘాట్‌లో నివాళులు అర్పించేందుకు గవర్నర్లు బండారు దత్తాతేయ, తమిళసైతోపాటు మంత్రి కేటీఆర్ కూడా వచ్చారు. కార్యక్రమం అనంతరం గవర్నర్ కాన్వాయ్ బయటికెళ్తుండగా.. ఆ రూట్‌లో వెళ్లకుండా కేటీఆర్ కాన్వాయ్.. రాంగ్‌ రూట్ తీసుకుంది. దీంతో కేటీఆర్ కారును ట్రాఫిక్ పోలీసు అధికారి అడ్డుకున్నారు. రాంగ్ రూట్‌లో వస్తున్నారు.. ఇక్కడ మీకు అనుమతి లేదంటూ కారును ఆపేశారు. దీంతో టీఆర్ఎస్ కార్యకర్తలు ట్రాఫిక్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అయితే, కేటీఆర్ కాన్వాయ్‌లోని ఓ కారును ఆపేశారా..? లేదా ఆపిన కారులోనే మంత్రి ఉన్నారా..? అనే విషయం మాత్రం స్పష్టం లేదు.  

ఇది కూడా చదవండిః ‘మా’ ఎన్నికల్లో ట్విస్ట్.. పోటీ నుంచి తప్పుకున్న సీవీఎల్

Advertisement

తాజా వార్తలు

Advertisement