Tuesday, April 23, 2024

ఫ్యాక్ట్ చెక్ః పెండింగ్ చలాన్లకు 50 శాతం రాయితీ నిజమేనా?

దసరా పండగ సందర్భంగా 50 శాతం రాయితీతో పెండింగ్ చలాన్లు చెల్లించేందుకు ట్రాఫిక్ పోలీసులు అవకాశం కల్పించారన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే, ఫేక్ న్యూస్ అని పోలీసులు స్పష్టం చేశారు. వివరాల్లోకి వెళ్లితే.. ట్రాఫిక్ నిబంధనల్ని ఉల్లంఘించిన వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు ఈ చలాన్లు పంపిస్తున్నారు. ఇలా హైదరాబాద్ నగర వ్యాప్తంగా చాలా వాహనాలనపై పదుల సంఖ్యలో చలాన్లు, రూ. వేలల్లో జరిమానాలు ఉంటున్నాయి. ఈ క్రమంలో చాలా మంది ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నారు. ఇలాంటి పరిస్థితికి చెక్ పెట్టడానికి ప్రభుత్వం దసరా పండగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. 50 శాతం రాయితీతో పెండింగ్ చలాన్లు చెల్లించే సౌకర్యాన్ని కల్పిస్తోంది. అక్టోబర్ 4 నుంచి 7వ తేదీ వరకు గోషామహల్ స్టేడియంలో నిర్వహించే ‘ప్రత్యేక లోక్ అదాలత్’ ద్వారా చలాన్ల మొత్తాలను చెల్లించేందుకు అవకాశం ఉందని వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

దీనిపై స్పందించిన హైదరాబాద్ పోలీసులు… అందంతా ఫేక్ న్యూస్ అని తేల్చారు. సోషల్ మీడియలో జరుగుతున్నట్లు తాము ఎలాంటి రాయితీ ప్రకటించ లేదని స్పష్టం చేశారు. ప్రజలు ఇలాంటి వదంతులు నమ్మొద్దని పోలీసులు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement