Sunday, September 24, 2023

‘అఖండ’ చిత్ర టీంకి ధ‌న్య‌వాదాలు తెలిపిన ‘హైద‌రాబాద్ ట్రాఫిక్ పోలీసులు’

ద‌ర్శ‌కుడు బోయ‌పాటి తెర‌కెక్కించిన చిత్రం అఖండ. ఈ చిత్రంలో హీరోగా బాల‌కృష్ణ‌, హీరోయిన్ గా ప్ర‌గ్యాజైశ్వాల్ న‌టించారు. ఈ చిత్రం రికార్డులు కొల్ల‌గొడుతోంది. కాగా ఈ చిత్రంపై హైద‌రాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు సంచ‌ల‌న ట్వీట్ ని చేశారు. రోడ్డు భద్రతను ప్రోత్సహించినందుకు నటుడు సినీ హీరో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను అలాగే… “అఖండ” సినిమా టీమ్ అందరికీ ట్విట్టర్ ద్వారా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేర‌కు అఖండ సినిమాలోని బాలయ్య, హీరోయిన్‌ ప్రగ్యా జైశ్వాల్‌ ఇద్దరు కారులో వెళ్లే ఓ సీన్‌ ను ట్యాగ్‌ చేస్తూ.. ఈ ట్వీట్‌ చేశారు హైదరాబాద్‌ సిటీ ట్రాఫిక్ పోలీసులు. ఇందులో బాలయ్య , ప్రగ్యా ఇద్దరూ సీట్‌ బెల్టు పెట్టుకుని ఉంటారు. కారు సీట్ బెల్ట్ ధరించి ఎంత దూరమైనా, ఎవరి కారు అయినా సరే ఎల్లప్పుడూ సీట్ బెల్ట్ ధరించండి అంటూ ఈ ట్వట్‌ లో పేర్కొన్నారు. ఇలాగే ప్రజలందరూ సీట్‌ బెల్టు పెట్టాకోవాలని సూచనలు చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -
   

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement