Thursday, April 25, 2024

Hyderabad: గంజాయి సప్లయ్​ చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా.. ఆరుగురిని అరెస్టుచేసిన పోలీసులు

590 కిలోల గంజాయితో పట్టుబడిన ఆరుగురిని ఎల్‌బీ నగర్‌ జోన్‌ స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌, అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మహారాష్ట్రకు చెందిన కరణ్ పరుశరామ్ పర్కలే అని పోలీసులు తెలిపారు. ఇతను 2019 లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర నుండి గంజాయి అక్రమ రవాణా చేస్తున్నట్టు తమ దర్యాప్తులో తేలిందన్నారు.

ఇక.. ఈ కేసులో కరణ్‌కి రాజు, భీమాతో తనకు పరిచయం ఏర్పడింది. ఇద్దరూ గంజాయి అమ్మేవారు. కరణ్‌ గంజాయిని కిలో 3వేల రూపాయలకు కొనుగోలు చేసి కిలో రూ.15000 నుంచి రూ.20000 వరకు విక్రయిస్తుండేవాడు. ఆగస్టు 21న విశ్వసనీయ సమాచారం మేరకు ఎల్‌బీ నగర్‌ జోన్‌కు చెందిన స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులతో కలిసి కరణ్‌, అజయ్‌ మహదేవ్‌ ఇతాపే, సంతోష్‌ అనిల్‌ గైక్వాడ్‌, ఆకాశ్‌ శివాజీ చౌదరి, వినోద్‌ లక్ష్మణ్‌ గాడే, భూక్య సాయి కుమార్‌లను 590 కిలోల గంజాయి సప్లయ్​ చేస్తుండగా పట్టుకున్నారు. వీరి నుంచి ఎనిమిది మొబైల్ ఫోన్లు, రూ.1,900 నగదు, మారుతీ స్విఫ్ట్ డిజైర్ కారు, మహీంద్రా పికప్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement