Wednesday, April 24, 2024

Breaking: హైదరాబాద్ డ్రగ్స్ కేసు.. కీలక నిందితుడు అరెస్ట్..

హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కీలక నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఎడ్విన్ తో కలిసి డ్రగ్స్ సరఫరా చేసిన బాలమురుగన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎడ్విన్ ఇచ్చిన సమాచారం మేరకు గోవాలో బాలమురుగన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, తమిళనాడు, కేరళ, గోవాలో డ్రగ్స్ దందా కొనసాగించినట్లు తెలిపారు. బాలమురుగన్ హోటళ్లు ఏర్పాటు చేసినట్లు పోలీసులు గుర్తించారు. హోటళ్లు కేంద్రంగా బాలమురుగన్ డ్రగ్స్ సరఫరా చేశారన్నారు. బాలమురుగన్ జాబితాలో 2వేల మంది వినియోగదారులు ఉన్నట్లు గుర్తించారు. బాలమురుగన్ ను గోవా నుంచి హైదరాబాద్ కు తీసుకువచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement