Tuesday, April 16, 2024

Hyderabad: విమాన ప్రయాణికులకు అలర్ట్​.. ఎయిర్​పోర్టుకు ముందే చేరుకోవాలన్న అధికారులు

పండుగల సీజన్​లో ఉండే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రయాణాలు ఆలస్యం కాకుండా చూసుకోవాలని రాజీవ్​గాంధీ ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్ట్​ (RGIA) అధికారులు కోరారు.  ఈ మేరకు ఇవ్వాల (శనివారం) ట్రాఫిక్​ అడ్వైజరీకి సంబంధించిన ఒక ప్రకటన రిలీజ్​ చేశారు. హైదరాబాద్ నుండి ఎయిర్​పోర్టుకు వచ్చే వారు చాలా ముందుగానే విమానాశ్రయానికి చేరుకోవాలని RGIA అధికారులు కోరారు.

విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులు తమ జర్నీని ముందుగానే ప్లాన్ చేసుకోవాలని ఆర్​జీఐఏ అధికారులు అభ్యర్థించారు. విమానాశ్రయం నుండి హైదరాబాద్​ సిటీకి రవాణా సౌకర్యాల కోసం ఎక్కువ సమయం వేచి ఉండాల్సి వస్తున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలిపారు. అంతేకాకుండా ప్రయాణికులు విమానాశ్రయంలో అందుబాటులో ఉన్న బహుళ రవాణా మార్గాలను ఉపయోగించుకోవచ్చన్నారు. 

ఇక.. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) ఇటీవల శిల్పారామం నుండి RGIA వరకు బస్సు సర్వీసులను ప్రారంభించింది. ఈ బస్సులు ఉదయం 4:30 నుండి రాత్రి 10:30 వరకు అందుబాటులో ఉంటాయి. ప్రతిరోజూ, వారానికి ఏడు రోజులు, ప్రతి 30 నిమిషాలకు ఒక బస్సు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. రోజువారీ ప్రయాణికులకు 10శాతం తగ్గింపు లభిస్తుందని ​ అధికారులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement