Thursday, April 25, 2024

మెట్రో ట్రైన్ లో యంగ్ హీరో అఖిల్ – ‘ఏజెంట్’ కోస‌మేనా

యంగ్ హీరో అఖిల్ మెట్రో ట్రైన్ లో సంద‌డి చేశాడు.. ఇప్పటి వరకు లవర్ బాయ్ ఇమేజ్ కోసం పరితపించి భంగపడ్డ ఈ హీరో ప్రస్తుతం విలక్షణ దర్శకుడు సురేందర్ రెడ్డితో కలిసి “ఏజెంట్” అనే మూవీ చేస్తున్నాడు. ఈ మూవీలో అఖిల్ క్యారెక్టరైజేషన్ భిన్నంగా ఉండనుందని సమాచారం. సురేందర్ రెడ్డి సినిమాలంటేనే హీరోల గెటప్ పూర్తిగా మార్చేస్తాడని టాక్ ఉంది. గతంలో ఆయనతో సినిమాలు చేసిన మహేశ్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ ల గెటప్ లను గుర్తు పట్టలేకుండా మార్చేసి కొత్తగా ప్రజెంట్ చేశాడు. ఇప్పుడు యంగ్ హీరో అఖిల్ ను కూడా అలాగే మార్చేసేందుకు కంకణం కట్టుకున్నాడు.అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఆ ఫోటో వైరల్ గా మారింది. హైదరాబాద్ మెట్రో రైలులో అక్కినేని అఖిల్… ప్రయాణిస్తున్న ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఏజెంట్ మూవీ షూటింగ్ లో భాగంగానే అక్కినేని అఖిల్ మెట్రో ఎక్కినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement