Saturday, April 1, 2023

కొండల్లో వందల మీటర్ల లోతులో.. ఇరాన్ వైమానిక‌స్థావ‌రం

భూగ‌ర్భంలో వైమానిక స్థావ‌రాన్ని నిర్మించి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది ఇరాన్. శ‌త్రు దేశాల దాడుల నుంచి పైట‌ర్ జెట్ల‌ను..ఆయుధ సంప‌త్తిని కాపాడుకునేందుకు ఇలా భూగ‌ర్భంలో వైమానిక స్థావ‌రం నిర్మించ‌డం విశేషం.తమ దేశంలోనే తొలి అండర్ గ్రౌండ్ ఎయిర్ బేస్ వివరాలను ప్రపంచానికి తెలిపింది ఇరాన్. భూగర్భ వైమానిక స్థావరానికి సంబంధించిన ఫొటోలను అధికారిక న్యూస్ ఏజెన్సీ ఐఆర్ఎన్ఏ (ఇస్లామిక్ రిపబ్లిక్ న్యూస్ ఏజెన్సీ) ద్వారా బయటపెట్టింది. అందులో ఎయిర్ ఫోర్స్ సిబ్బంది, ఎఫ్ -4ఈ ఫాంటమ్ 2 ఫైటర్ బాంబర్ కనిపించింది. ఫైటర్ జెట్లు టేకాఫ్ తీసుకుంటున్న వీడియోలను ఇరాన్ స్టేట్ టెలివిజన్ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఈ స్థావరానికి ‘ఒఘాబ్ (డేగ) 44’ అని ఇరాన్ పేరుపెట్టింది. ఇందులో అన్ని రకాల ఫైటర్ జెట్లు, క్రూయిజ్ మిసైళ్లు, బాంబర్లు, డ్రోన్లను భద్రపరిచేందుకు వీలుందని ఐఆర్ఎన్ఏ తెలిపింది. అయితే ఇరాన్ లో ఎయిర్ బేస్ ను ఎక్కడ నిర్మించారనే వివరాలను మాత్రం వెల్లడించలేదు. కొండల్లో వందల మీటర్ల లోతులో నిర్మించినట్లు చెప్పింది. ఏదైనా దాడి జరిగితే లక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ఎయిర్ బేస్‌లోని జెట్లకు దీర్ఘ-శ్రేణి క్రూయిజ్ క్షిపణులను అమర్చినట్లు ఫోర్బ్స్ పత్రిక వెల్లడించింది. ఇజ్రాయెల్ సహా శత్రువులు ఎవరైనా ఇరాన్ పై దాడి చేస్తే.. మా ఎయిర్ బేస్ ల నుంచి వెంటనే ప్రతిస్పందన ఎదుర్కొంటారు. అందులో ఈగల్ 44 కూడా ఉంటుంది అని ఇరాన్ ఆర్మ్ డ్ ఫోర్సెస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మేజర్ జనరల్ మొహమ్మద్ బాఘేరీ చెప్పారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement