Saturday, April 20, 2024

దేశ వ్యాప్తంగా వంద సైనిక పాఠ‌శాల‌లు – రాజ్ నాథ్ సింగ్

సాయుధ ద‌ళాల్లో మ‌హిళ‌ల ప్రాతినిధ్యాన్ని పెంచ‌డంపై ప్ర‌భుత్వం దృష్టి సారించింద‌ని ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఈ దిశ‌గా ఇప్ప‌టికే చ‌ర్య‌లు తీసుకున్నామ‌న్నారు. ఇక దేశ వ్యాప్తంగా వంద సైనిక పాఠ‌శాల‌ల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు రాజ్ నాథ్ సింగ్ వెల్ల‌డించారు. ఈ స్కూళ్ల‌ను ఏర్పాటు చేయ‌డంతో ఇక్క‌డ చ‌దువుకున్న బాలిక‌లు సాయుధ ద‌ళాల్లో చేరేందుకు, దేశ భ‌ద్ర‌త కోసం పోరాడేందుకు మార్గం ఏర్ప‌డుతుంద‌ని చెప్పారు. సైనిక స్కూళ్లలో వారికి చోటు కల్పించడం, మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ ఏర్పాటు చేయడం వంటి నిర్ణయాలను గుర్తు చేశారు. కొత్త సైనిక స్కూళ్ల ఏర్పాటుతో దేశానికి సేవ చేయాలన్న బాలికల ఆకాంక్షలు నెరవేరతాయన్నారు.సైనిక స్కూళ్ల పనితీరు ఆధారంగా ర్యాంకింగ్ లు కేటాయించేందుకు ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement