Thursday, April 25, 2024

ద పీకాక్ మేగ‌జైన్ క‌వ‌ర్ పై మ‌హేశ్ బాబు

ద పీకాక్ మేగ‌జైన్ క‌వ‌ర్ పై మెరిశారు టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు.ద పీకాక్ మేగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై తాను ఉన్న ఫొటోను స్వ‌యంగా మ‌హేశ్ బాబు ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు.మేగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై త‌న ఫొటోను ప్ర‌చురించిన ద పీకాక్ మేగ‌జీన్‌కు ఆయ‌న ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఈ ఫొటో కోసం జ‌రిగిన షూట్ మొత్తం ఉల్లాసంగా గ‌డిచింద‌ని పేర్కొన్న మ‌హేశ్.. ఆ షూట్ కోసం క‌ష్ట‌ప‌డ్డ ద పీకాక్ మేగ‌జైన్ జ‌ర్న‌లిస్టులు ఫాల్గుణి, షేన్‌ల‌కు కూడా మ‌హేశ్ బాబు థ్యాంక్స్ చెప్పారు. స‌ర్కారు వారి పాట చిత్రం ప్ర‌మోష‌న్స్‌లో టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు ఫుల్ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ నెల 12న ఈ చిత్రం విడుద‌ల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement