Friday, April 19, 2024

Breaking: ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద కూలిన భారీ చెట్టు.. పలు వాహనాలు ధ్వంసం

హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వద్ద ఉన్న ఓ భారీ చెట్టు కుప్పకూలింది. పూర్తిగా ఎండిపోయిన చెట్టు ఒక్కసారిగా మంగళవారం నేలకొరిగింది. ఈ చెట్టుకింద పార్కింగ్ చేసిన ఏడు బైకులు, మూడు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో చెట్టుకింద ఎవరూ లేకపోవడంతో ప్రాణపాయం తప్పింది. కాగా ఎండిపోయిన చెట్టును తొలగించాలని పలుమార్లు జీహెచ్ ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోలేదని స్థానికులు చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement