Tuesday, April 23, 2024

ముంబైలో మిస్టరీ గర్ల్​తో హృతిక్ ​.. డేటింగా, ఆమె​ ఎవరంటూ అభిమానుల ఆరా!

బాలీవుడ్​ సూపర్​ స్టార్​ హృతిక్​ రోషన్​ అంటే చాలామంది లైక్​ చేస్తారు. తన మూవీస్​, డ్యాన్స్​ అంటే ఎంతో క్రేజీగా ఫీలవుతారు. అయితే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి అతనిప్పుడు భార్యతో విడిపోయి ఒంటరిగా ఉంటున్నాడు. దీంతో అతను ఏ అమ్మాయితో కనిపించినా అతని అభిమానులు ఇంట్రస్టింగ్​ అడుగుతుంటారు.. అది అతనిపై ప్రేమతోనే కానీ, ద్వేషంతో మాత్రం కాదు.

అయితే.. ఈ మధ్య ముంబయిలో ఓ అమ్మాయి చేపట్టుకుని వెళ్తుండగా కొంతమంది అతడిని చూసి ఫొటోలు తీస్తూ వెంటపడ్డారు. అతనితో ఉన్న ఆ మిస్టరీ గర్ల్​ ఎవరు అని ఆరాలు తీయడం మొదలెట్టారు. హృతిక్​ ఆమె చేతులు పట్టుకోవడంతో అభిమానులంతా ఆమె అతని కొత్త గర్ల్​ఫ్రెండ్​ కావచ్చేమో అని గుసగుసలాడుకుంటున్నారు. కొంతమందేమో వారి ఫ్యామిలీ మెంబర్​ అయి ఉంటుందిలే అని సర్ది చెబుతున్నారు.

ముంబైలో మిస్టరీ ఉమెన్‌తో కనిపించిన హృతిక్ ..

ఫొటోగ్రాఫర్లు షేర్​ చేసిన వీడియోలో.. ‘‘హృతిక్ రోషన్ ఆ అమ్మాయి చేయి పట్టుకుని తన కారు వైపు నడుస్తూ కనిపించాడు. అతను ఆమెను రెస్టారెంట్ నుండి తన కారులోకి తీసుకెళ్లాడు. కొంతమంది వారిని వెంబడించడంతో హృతిక్​ ఆమెను రక్షించడానికి ట్రై చేశాడు. మాస్క్‌ ధరించి ఉండడంతో ఆ మహిళ ముఖం కనిపించడం లేదు’’. అని కొంతమంది చెబుతున్నారు.

అభిమానులు ఎలా స్పందించారు?

- Advertisement -

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆ మిస్టరీ మహిళ ఎవరో చెప్పాలని అభిమానులు డిమాండ్ చేశారు. ఆమె అతని స్నేహితురాలు అని చాలా మంది ఊహించారు. అయితే, ఆమె కేవలం కుటుంబ సభ్యురాలు కావచ్చని కొంతమంది  చెప్పుకొచ్చారు. 

వర్క్ ఫ్రంట్‌లో..

హృతిక్ రోషన్ తదుపరి యాక్షన్ చిత్రం విక్రమ్ వేదలో కనిపించనున్నాడు.  అదే పేరుతో తమిళ చిత్రానికి రీమేక్. ఇందులో సైఫ్ అలీ ఖాన్, రాధికా ఆప్టే కూడా నటిస్తున్నారు. దీపికా పదుకొణెతో హృతిక్‌కి ఫైట్​ సీన్​ కూడా ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement