Thursday, April 25, 2024

Smart Tech: క్వాలిటీ దెబ్బతినకుండా.. వాట్సాప్‌లో ఫొటోలు షేర్ చేయడం ఎలా?

వాట్సప్  మెస్సేజింగ్ యాప్ ద్వారా ఏం చేస్తున్నామో అందరికీ తెలిసిందే.. కానీ, మనం పంపించే ఫొటోల క్వాలిటీ దెబ్బతినకుండా ఒరిజినల్ క్వాలిటీ ఉండేలా షేర్ చేసుకోవచ్చు.. ఇంతకీ ఈ విషయం మీకు తెలుసా..?

వాట్సప్ మెస్సేజింగ్ యాప్ అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. ప్రపంచంలోని నలుమూలల్నించి ప్రజలు వాట్సప్ ద్వారానే మెస్సేజెస్, ఫొటోలు, వీడియోలు, స్టిక్కర్లు, మీమ్స్, విషెస్ పంపించుకుంటుంటారు. వివిధ రకాల ఈమోజీలు, స్టిక్కర్ల ద్వారా బంధుమిత్రులపై తమకున్న అభిమానాన్ని చాటుకుంటుంటారు. అయితే చాలా సందర్భాల్లో వాట్సప్ ద్వారా పంపించే ఫొటోలు కంప్రెస్ అయిపోతుంటాయి. అంటే ఫైల్ వేగంగా వెళ్లేందుకు 70 శాతం క్వాలిటీకి పడిపోతుంది. వాట్సప్ ద్వారా ఫొటోలు పంపేటప్పుడు ఎదురయ్యే ప్రధాన సమస్య ఇదే. ఫొటోల క్వాలిటీ తగ్గొపోవడంతో బ్లర్ కావడం, ఒరిజనల్ రిజల్యూషన్ లేకపోవడం చాలామంది గమనించే ఉంటారు.. అయితే చిన్న టిప్ ద్వారా ఒరిజినల్ క్వాలిటీతో ఫొటోలు పంపించుకోవచ్చు..

అయితే వాట్సప్ ద్వారా ఒరిజినల్ క్వాలిటీతో ఫొటోలు పంపించడం సాధ్యమే అంటున్నారు నిపుణులు. అదెలాగో చూద్దాం. కొన్ని ట్రిక్స్ అవలంభిస్తే ఒరిజినల్ క్వాలిటీతోనే ఫొటోలు పంపించుకోవచ్చు.

ముందుగా వాట్సాప్ అకౌంట్ (whatsapp) ఓపెన్ చేయండి. ఎవరికి ఫొటో పంపించాలనుకుంటున్నారో వారి కాంటాక్ట్ ఓపెన్ చేయండి. తర్వాత చాట్ స్క్రీన్ దిగువన పేపర్ క్లిప్ వంటి ఐకాన్ కన్పిస్తుంది. దానిపై క్లిక్ చేయండి. చాలా ఐకాన్స్ లిస్ట్ కన్పిస్తుంది. ఇప్పుడు డాక్యుమెంట్స్ ఆప్షన్ ప్రెస్ చేయండి. ఇప్పుడు పంపించాలనుకున్న ఫొటోను డాక్యుమెంట్ ద్వారా పంపించండి. ఒకవేళ ఫొటో కన్పించకపోతే బ్రౌజ్ అదర్ డాక్స్ క్లిక్ చేయండి. అప్పుడు ట్యాప్ చేయండి. కావల్సిన ఫొటోను ఎంచుకుని పంపించండి. ఈ విధానం ద్వారా పంపిస్తే.. ఫొటో క్వాలిటీ (Quality) దెబ్బతినకుండా ఉంటుంది. మీరు ఓసారి  ట్రై చేసి చూడండి..

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్‌,  ట్విట్టర్    పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement