Friday, March 29, 2024

పవర్​ గ్రిడ్​పై చైనా హ్యాకింగ్.. హానికర ట్రోజన్ బగ్స్ ప్రయోగం..

మన దేశ విద్యుత్ రంగాన్ని దెబ్బతీసేందుకు చైనా కుటిల యత్నాలకు పాల్పడుతోంది. ఈ మేరకు ఇంటెలిజెన్స్ రంగాలు అప్రమత్తమయ్యాయి. కాగా, విద్యుత్​ వ్యవస్థను దెబ్బతీయడానికి సైబర్-గూఢచర్య అటాక్ చేయాలని చైనా భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగా థ్రెట్ యాక్టివిటీ గ్రూప్ 38 అనే కోడ్‌నేమ్‌తో చైనా హ్యాకర్లు ఈ మధ్య ఇండో-చైనా సరిహద్దుకు సమీపంలోని లడఖ్‌ దగ్గరున్న విద్యుత్ పంపిణీ కేంద్రాలను.. ఉత్తర భారతదేశంలోని కనీసం ఏడు లోడ్ -డిస్పాచింగ్ సెంటర్లను టార్గెట్ చేసుకున్నట్టు తెలుస్తోంది.

గ్రిడ్ హ్యాకింగ్‌పై ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిసిన వివరాల మేరకు.. ఈ ఆపరేషన్ కోసం హ్యాకర్లు హానికరమైన సాఫ్ట్ వేర్ ట్రోజన్ షాడో ప్యాడ్‌ను ఉపయోగించినట్టు తెలుస్తోంది. ట్రోజన్ అనేది చైనీస్ స్టేట్ హ్యాకింగ్ టూల్, ఇది స్టేట్ స్పాన్సర్డ్ హ్యాకింగ్ గా ఇంతకుముందే నిర్ధరణ అయ్యింది. షాడో ప్యాడ్‌ను పీపుల్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ సెక్యూరిటీ గ్రూప్ ఉపయోగిస్తోంది. వారు TAG 38 ఆపరేషన్ కోసం పాయిజన్ ఐవీ, రాయల్ రోడ్ ఐటీని ఉపయోగించారు అని ప్రాథమిక సమాచారం.

కాగా, IP కెమెరా నెట్‌వర్క్ కు కనెక్ట్ చేసిన థర్డ్-పార్టీ కాన్ఫిగరేషన్ ద్వారా హ్యాకర్‌లు గ్రిడ్ సెంటర్‌లకు యాక్సెస్‌ని పొందారు. తాము ఈ లక్ష్యాన్ని ఆర్థిక గూఢచర్యం, కొన్ని సాంప్రదాయ గూఢచర్య కార్యకలాపాలుగానే పరిగణిస్తాం. ఇంతకుముందు వారు 10 డిస్పాచ్ సెంటర్లపై ఇలాంటి దాడులకు యత్నించారు అని కొంతమంది అధికారులు మీడియాకు ఈ సీక్రెట్ సమాచారాన్ని లీక్ చేశారు. దేశంలోని కీలకమైన మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం, లేదా భవిష్యత్ కార్యకలాపాలు, వారి టార్గెట్లో భాగంగా అటాక్ చేయడానికి తమను తాము ప్రిపేర్గా ఉంచుకోవడం వారి ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తోందని నిఘా వర్గాలు వెల్లడించాయి.

అంతకుముందు కూడా హ్యాకర్లు భారత కార్యకలాపాలను నిర్వీర్యం చేసేందుకు ప్రైవేట్ సర్వీస్ ప్రొవైడర్ లేదా లాజిస్టిక్స్ సర్వీస్ ఆర్గనైజేషన్‌పై దాడి చేశారు. మరో గ్రూప్ TAG 26, ఇండియన్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్‌పై దాడి చేయడంలో కూడా చురుకుగా ఉందని నిఘా వర్గాలు తెలిపాయి. అన్ని గూఢచార సంస్థల ద్వారా జరుగుతున్న హ్యాకింగ్ ప్రయత్నాల్లో ఇది ఒక భాగం. మనం ఎప్పటికప్పుడు మన సిస్టమ్ని అప్‌గ్రేడ్ చేసుకోవాలి. దానికి కావాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. భవిష్యత్తులో కూడా వ్యవస్థలు అప్‌గ్రేడ్ చేస్తాం అని టాప్ ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement