Wednesday, April 24, 2024

హైలెవల్​ స్మగ్లింగ్​: గంజాయి లోడుతో లారీ, ఎస్కార్ట్​గా కారు.. అడ్డంగా దొరికిపోయారు, మొత్తం సీజ్​!

ఇది అట్లాంటి ఇట్లాంటి స్మగ్లింగ్​ కాదు.. అంతా హైలెవల్​.. లారీలో ఫుల్​గా ప్యాక్​ చేసిన గంజాయి.. దానికి ఎస్కార్ట్​గా ముందు ఒక కారు.. భారీగానే స్కెచ్చేశారు.. కానీ, ఆఖరికి పోలీసుల వలలో చిక్కుకున్నారు. కటకటాల్లోకి వెళ్లారు.. గంజాయి కొనుగోలుకు బ్యాంకు నుంచి లక్షలాది రూపాయలు ట్రాన్స్​ఫర్​ చేసిన వ్యక్తుల అకౌంట్లను సీజ్​ చేయించారు పోలీసు అధికారులు.

ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంతర్రాష్ట్ర స్మగ్లింగ్ ముఠా గుట్టు రట్టు చేశారు. వారి నుంచి దాదాపు 1400 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్ ఏజెన్సీ నుంచి మధ్యప్రదేశ్‌కు లారీలో గంజాయిని తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో తనిఖీలు చేపట్టినట్టు తూర్పుగోదావరి ఎస్​పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ తనిఖీల్లో అనుమానాస్పదంగా ఉన్న లారీని తనిఖీ చేయగా పెద్ద ఎత్తున గంజాయి పట్టుబడిందన్నారు. అయితే లారీకి ముందుగా ఎస్కార్ట్​ వాహనంగా వెళ్తున్న కారును కూడా సీజ్​ చేసినట్టు తెలిపారు. గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశామన్నారు ఎస్పీ.

ఆంధ్రప్రదేశ్‌లోని వైజాగ్ ఏజెన్సీ నుంచి మధ్యప్రదేశ్‌కు లారీలో లోడ్​చేసి తరలిస్తున్నట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ కేసులో భాగంగా లక్షల రూపాయలను ట్రాన్స్​ఫర్​ చేసిన ఇతర నిందితుల ఖాతాలను సీజ్ చేయాలని బ్యాంకర్లను అభ్యర్థించినట్లు తెలిపారు. ఒక కొనుగోలుదారు, అమ్మకందారు, మధ్యవర్తి, సప్లయర్లతో సహా మొత్తం ఐదుగురు నిందితులు ఈ కేసులో ఉన్నారు. ఈ ఐదుగురిలో ఇద్దరిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మిగిలిన వారిని త్వరలోనే అరెస్టు చేస్తామని ఎస్పీ తెలిపారు. కాగా, ఈ కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement