Thursday, April 18, 2024

Big Story | కొత్తింటి పథకం.. ఒక్కో ఇంటికి 3లక్షలు, జూన్ నుంచి శ్రీకారం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: గ్రామీణ పేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు తీసుకొచ్చిన గృహలక్ష్మి పథకానికి మార్గదర్శకాలు రెడీ అవుతున్నాయి. ఈ సరికొత్త ఇళ్ల పథకానికి ఈ ఏడాది రూ. 18వేల కోట్లను ఖర్చు చేసేలా ప్రయత్నాలు చేస్తున్నది. వచ్చే నెలనుంచే సొంతింటి పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టనున్నది. నేటి కలెక్టర్ల భేటీలో మార్గదర్శకాలకు ఆమోదముద్ర వేయనున్నారు. ఇదే అంశం ఈ సదస్సులో కీలకం కానున్నది.

ఎన్నికల ఏడాదిలో శీఘ్రంగా గృహలక్ష్మికి మార్గదర్శకాలు రెడీ చేసి అర్హులను గుర్తించాలని యోచిస్తోంది. తద్వారా వీలైనంత ఎక్కువ మందికి ప్రయోజనం కల్పించి ఎన్నికల ఏడాదిలో ఈ పథకానికి ఈసీ అడ్డంకులు, ఆంక్షలు సృష్టించకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. తెలంగాణ సర్కార్‌ విప్లవాత్మకంగా నిరుపేదలకు సొంతింటి కల సాకారం దిశగా కృషి చేస్తోంది. గతంలో ఎవరూ అడగకుండానే స్వయంగా డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల పథకాన్ని ప్రారంభించిన ప్రభుత్వం వీలైనంత తొందర్లో ఆయా ఇండ్ల పంపిణీని పూర్తిచేసి గ్రామీణ ప్రాంతాల్లో సొంతింటి పథకానికి చర్యలు తీసుకోవాలని భావిస్తోంది.

ఇప్పటికే పూర్తయిన రెండు పడకల ఇళ్ల పెండింగ్‌ పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించేందుకు జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఆ తర్వాత సొంతింటికి రూ. 3లక్షల పథకాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలకు రెండు పడకల ఇళ్ల నిర్మాణాలు చేపట్టి ఉచితంగా యాజమాన్య హక్కులను అందించే అతిపెద్ద కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్న సంగతి విధితమే.

2.91లక్షల ఇండ్లు పూర్తి…
రాష్ట్రంలో 2.91 లక్షల డబుల్‌ ఇండ్ల నిర్మాణం చేపట్టేందుకు రూ.18 వేల కోట్ల నిధులను ప్రభుత్వం మంజూరు చేసింది. మున్సిపాలిటీలు, గ్రామాలలో ఇప్పటికే సదరు నిర్దేశిత ఇళ్ల నిర్మాణం తుది దశకు చేరుకున్నాయి. వాటికి మౌళిక సదుపాయాల కల్పనలో భాగంగా రహదారులు, విద్యుత్‌, మంచినీరు, డ్రైనేజీ వంటి సౌకర్యాలు పూర్తి చేసిన ప్రభుత్వం లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి బాధ్యతను జిల్లా కలెక్టర్లకు అప్పగించింది. 2023 జనవరి 15లోపు పెండింగ్‌ స్వల్ప పనులను పూర్తి చేయించి మౌళిక వసతులు కల్పించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని ఆదేశించింది. ఇండ్లను లబ్దిదారులకు అప్పగించే విధంగా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

- Advertisement -

అర్హతలివే…
లబ్దిదారుల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని, దారిద్య్ర రేఖకు దిగువన ఉండి తెల్ల రేషన్‌ కార్డు కలిగి ఉండాలని సూచించింది. అద్దె భవనాల్లో నివసిస్తున్న వారు అర్హులని ప్రభుత్వం మార్గదర్శకాల్లో తెలిపింది. ముందుగా గ్రామ సభలు, వార్డు సభలు నిర్వ#హంచి దరఖాస్తులు స్వీకరించాలని, వచ్చిన దరఖాస్తులను సంబంధిత త#హశీల్దార్లకు పంపించాలని, క్షేత్రస్థాయిలో దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితాను కలెక్టర్లకు పంపించాలని తాజా ఆదేశాల్లో పేర్కొంది. అనంతరం జాబితాను కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి పంపిస్తే క్షుణ్ణంగా పరిశీలించి తుది జాబితా ఖరారు చేయనున్నారు. నిర్మించిన ఇళ్ల కంటే అర్హులైన లబ్ధిదారులు ఎక్కువ ఉంటే లక్కీ డీప్‌ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని, మిగిలిన దరఖాస్తుదారుల జాబితాను వెయిటింగ్‌ లిస్ట్‌లో పెట్టాలని అధికారులు భావిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement