Tuesday, April 23, 2024

ప్యాంట్ పై బుర‌ద ప‌డింద‌ని – మ‌హిళా పోలీస్ ఏం చేసిందంటే

కొన్ని సంఘ‌ట‌న‌లు విచిత్రంగా ఉంటే, మ‌రికొన్ని సంఘ‌ట‌న‌లు మాన‌వ‌త్వాన్ని మ‌రిపించే విధంగా ఉంటాయి. ఇప్పుడ‌లాంటి సంఘ‌ట‌నే సోష‌ల్ మీడియాలో వీడియో వైర‌ల్ గా మారింది. పొర‌పాటున మ‌హిళా పోలీస్ ప్యాంట్ పై బుర‌ద ప‌డింది. దాంతో కోపోద్రిక్తురాలైన ఆమె ప్యాంట్ ని శుభ్రం చేయించుకోవ‌డ‌మే కాదు ఓ వ్య‌క్తి చెంప‌ని ప‌గుల‌కొట్టింది. ఈ సంఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోని రేవాలో చోటు చేసుకుంది. విష‌యం ఏంటంటే.. ఓ వ్య‌క్తి త‌న మోటారు సైకిల్ ని రివ‌ర్స్ చేస్తుండ‌గా అక్క‌డే ఉన్న మ‌హిళా పోలీస్ ప్యాంట్ పై పొర‌పాటున బుర‌ద ప‌డింది.

కోపంతో ఊగిపోయిన ఆ పోలీస్‌.. తన ప్యాంట్‌ని శుభ్రం చేయమని ఆ వ్యక్తి బలవంతం చేసింది. గత్యంతరం లేక ఆ వ్యక్తి ఆమె ప్యాంటును శుభ్రం చేశాడు. అయినా ఆ అధికారిణి శాంతించలేదు. ఆ వ్యక్తిని ఒక చెంపదెబ్బ కొట్టి వెళ్లిపోయింది.ఈ వీడియో వైరల్‌ కావడంతో విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. సదరు మహిళ ఖాకీ.. కలెక్టర్‌ కార్యాలయంలో పనిచేసే హెంగార్డు శశికళగా గుర్తించారు. ఈ ఘటనపై రేవా ఎస్పీ శివ కుమార్‌ మాట్లాడుతూ…”ఆ వీడియో తమదాకా వచ్చిందని, ఫిర్యాదు అందితే శశికళపై ఖ‌చ్చితంగా చర్యలు తీసుకుంటామ‌ని చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement