Friday, April 19, 2024

హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ అవార్డ్స్ కేట‌గిరిలో – ఆర్ ఆర్ ఆర్

హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేష‌న్ అవార్డ్స్ కేట‌గిరిలో నామినేష‌న్ పొందింది ఆర్ ఆర్ ఆర్. ఈ చిత్రంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌ని పోషించారు. కాగా స్టార్ ద‌ర్శ‌కుడు రాజమౌళి ఈ చిత్రాన్ని తెర‌కెక్కించారు. మార్చి 25న విడుదలైన ఈ చిత్రం రూ. 1,150 కోట్లను వసూలు చేసింది. అత్యధిక వసూళ్లను రాబట్టిన నాలుగో భారతీయ చిత్రంగా నిలిచింది. మరోవైపు ప్రతిష్ఠాత్మక అవార్డ్ కు ఈ చిత్రం నామినేషన్ పొందింది. ఈ విషయాన్ని ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఉత్తమ సినిమా కేటగిరీలో నామినేషన్ పొందడం సంతోషంగా ఉందని తెలిపింది. ఈ అవార్డ్స్ కు ఇంత వరకు ఏ భారతీయ చిత్రం కూడా పోటీ పడక పోవడం గమనార్హం. ఉత్తమ చిత్రం కేటగిరీలో ‘ఆర్ఆర్ఆర్’తో పాటు మరో 9 హాలీవుడ్ చిత్రాలు పోటీపడుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement