Friday, April 26, 2024

శ్మ‌శానంలోని చితి బూడిదతో హోలీ సంబురం.. 350 ఏళ్లుగా ఇదే ఆచారం, ఎక్క‌డంటే..

మ‌న సాంప్రదాయంలో హోలీ పండగకు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. విష్ణువు నరసింహావతారంలో వచ్చి హిరణ్యకశపుడిని చంపడంతో ఈ పండగ వచ్చిందని విశ్వాసం. హోలీ పండగను దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. మథుర, బృందావనం, బర్సానా ప్రాంతాల్లో మ‌రింత జోష్‌గా నిర్వహిస్తారు. అలాగే కాశీలో హోలీ ఏకాదశితో ప్రారంభమవుతుంది. ఈరోజున అక్కడి ప్రజలు.. మహేశ్వరుడి సన్నిదికి సమీపంలోని శ్మ‌శానంలో చితి బూడిదతో హోలీ జరుపుకోవ‌డం విశేషం. చితి బూడిదతో హోలీ పండగను ప్రారంభించిన తర్వాతే కాశీలో హోలీ మొదలవుతుంది.

మోక్షదాయిని కాశిలో శ్మ‌శానవాటిక అయిన హరిశ్చంద్ర ఘాట్ వద్ద చితి మంట ఎప్పుడూ మండుతూనే ఉంటుంది. ఇక్కడ 24 గంటలు దహనాలు, అంత్యక్రియలు జరుగుతుంటాయి. కలుపు మొక్కల మధ్య శ్మ‌శానవాటికలో ఎప్పుడూ దహన సంస్కారాలు జరుగుతున్న చోట సంవత్సరానికి ఒక పండుగ వస్తుంది. అదే రంగభారీ ఏకాదశి. వారణమాసిలో మార్చి 14న రంగుల ఏకాదశి శ్మ‌శానవాటికలో చితాభస్మంతో హోలీని ఆడారు. డ్రమ్.. ఘరియాల్, మృదంగంతో సహా అన్నిరకాల సంగీత ధ్వ‌నుల మధ్య హోలీని చితాభస్మంతో ఆడారు.

రంగులకు అతీతంగా ఈ చితాభస్మంతో ఏళ్ల‌ తరబడి హోలీని ఆడుతున్నారు. ఇట్లా హోలీ ఆటను దాదాపుగా 350 ఏళ్లుగా ఆడుతున్నారని చాలామంది చెబుతున్నారు.. ఈ నమ్మకం పురాతనకాలం నుంచి వ‌స్తోంద‌ట‌. రంగభారీ ఏకాదశి రోజున విశ్వనాథుడు పార్వతీ దేవికి ఆవును సమర్పించి కాశీకి చేరుకున్నప్పుడు.. అతను తన గణాలతో హోలీ ఆడినట్లుగా చెబుతుంటారు. కానీ ఆ శివయ్యకు తాను ఉండే శ్మ‌శానవాటికలో అఘోరాలతో కలిసి హోలీ ఆడలేకపోయాడు.. అందుకే రంగభారీ ఏకాదశి ప్రారంభమైన ఐదు రోజుల హోలీ పండగలో విశ్వనాథ్ అంత్యక్రియల చితిపై వారితో కలిసి హోలీ ఆడటానికి శ్మ‌శానవాటికకు వస్తాడన్న విశ్వాసం ఉంది.

అదేవిధంగా రంగభారీ ఏకాదశి హరిశ్చంద్ర ఘాట్ వద్ద మహాశంషన్ హారతితో ప్రారంభమవుతుంది. ఈ పండగకు ఊరేగింపు కూడా చేస్తారు. కార్యక్రమాన్ని దోమ్ రాజ కుటుంబానికి చెందిన బహదూర్ చౌదరి ప్రారంభిస్తారు. ఇది అనాధిగా వస్తున్న ఆచారం. పార్వతీదేవి ఆవును పొందిన తర్వాత దయ్యాలు.. వారి గణాలు..శ్మ‌శానవాటికలో హోలీ ఆడటానికి వస్తాయి. ఇదే నమ్మకంతో హోలీ ప్రారంభమవుతుంది. బాబా ఊరేగింపు కీనారం ఆశ్రమం నుండి బయలుదేరి మహా శ్మశాన వాటిక హరిశ్చంద్ర ఘాట్‌కు చేరుకుంటుంది. దీని త‌ర్వాత‌ మహాశంషణ్ నాథ్ పూజలు , హరతి వంటి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement