Thursday, April 25, 2024

జూలై 29న – హిట్ 2 రిలీజ్

జూలై 29న హిట్2 చిత్రం రిలీజ్ కానుంది. 2019లో వ‌చ్చిన ‘హిట్‌’కు సీక్వెల్‌గా తెర‌కెక్కింది. మొద‌టి పార్ట్‌లో విశ్వ‌క్‌సేన్ హీరోగా న‌టించగా, సెకండ్ పార్ట్‌లో అడివిశేష్ న‌టించాడు. ఈ చిత్రంపై ప్రేక్ష‌కుల‌లో మొద‌టి నుంచే భారీ స్థాయిలో అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. చిత్రం నుంచి విడుద‌లైన ప్ర‌చార చిత్రాలు, గ్లింప్స్ సినిమాపై రెట్టింపు అంచ‌నాల‌ను పెంచాయి.తాజాగా చిత్ర బృందం విడుద‌ల తేదీని ప్ర‌క‌టించింది. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ చిత్రం జూలై 29న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ట్లు మేక‌ర్స్ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. అడివి శేష్ ఇంటెన్సిటీతో ఏదో గ‌మ‌నిస్తున్న‌ట్లు పోస్ట‌ర్ ఉంది. మీనాక్షీ చౌద‌రీ హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రాన్ని వాల్ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్‌పై నాని, ప్ర‌శాంతి తిపిరినేని నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement