Thursday, April 25, 2024

విజ‌య్ దేవ‌ర‌కొండ బోల్డ్ ఫోజ్ – షాకింగ్ గా లైగ‌ర్ పోస్ట‌ర్

యంగ్ హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌..ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్ లో తెర‌కెక్కుతోన్న చిత్రం లైగ‌ర్. పూరి కనెక్ట్స్‌, ధర్మ ప్రొడక్షన్స్‌ నిర్మిస్తున్నాయి. అనన్య పాండే హీరోయిన్ గా న‌టిస్తోంది. మైక్‌ టైసన్‌, రమ్యకృష్ణ, రోనిత్‌ రాయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీం విజయ్​కు సంబంధించి ఓ షాకింగ్ పోస్టర్​ను విడుదల చేసింది. ఇందులో విజయ్​.. కండలు తిరిగిన దేహంతో బోల్డ్​ లుక్​లో రోజాపూలు పట్టుకుని నిలబడి ఉన్నాడు. రక్తం, చెమట, మనసు, ప్రాణం… అన్నింటినీ తీసుకొస్తున్నాం.. ఎప్పటికీ గుర్తుండిపోయే మాస్ యాక్షన్ ఎంటర్​టైనర్​లో విజయ్ దేవరకొండను మీ ముందుకు తీసుకొస్తున్నాం అని క్యాప్షన్​ జోడించింది. ఈ సినిమాలో విజయ్‌ మిక్స్డ్‌మార్షల్‌ ఆర్ట్స్‌ ఫైటర్‌గా కనిపించనున్నారు. ఈ పాత్ర కోసం ఆ విద్యలో ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. కఠిన కసరత్తులు చేసి సిక్స్‌ ప్యాక్‌ లుక్‌లోకి మారారు. ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. విజ‌య్ లుక్ చూసిన ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఈ లుక్ పై ప‌లు ర‌కాల కామెంట్స్ వినిపిస్తున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement