Thursday, April 25, 2024

‘బ‌ప్పిల‌హ‌రి’కి హృద‌య‌పూర్వ‌క నివాళుల‌ర్పించిన హీరో ర‌ణ్ వీర్ సింగ్

బాలీవుడ్ స్టార్ హీరో ర‌ణ్ వీర్ సింగ్ ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ బ‌ప్పిల‌హ‌రికి వీరాభిమాని. కాగా తాజాగా ఆయ‌న బ‌ప్పిల‌హ‌రికి హృద‌య‌పూర్వ‌క నివాళుల‌ర్పించారు. కాగా ఆయ‌న పోస్ట్ చేసిన ఫొటోల్లో ట్రెండీ వేర్ లో, స్లైలిష్ లుక్ లో బప్పి లహిరి, రణ్ వీర్ ఆకట్టుకుంటున్నారు. మరో వీడియోలో బప్పీ లహిరికి బాల్యం నుంచే సంగీతంపై ఎంత శ్రద్ధ ఉండేదో రణ్ వీర్ వివరిస్తుంటాడు. ఈ త్రోబ్యాక్ పిక్స్, వీడియోస్ పోస్ట్ చేస్తూ రణ్ వీర్ ఒక నోట్ రాశారు. ‘బప్పి లహిరి లాంటి వారు ఇప్పటి వరకు లేరు, భవిష్యత్ లోనూ ఉండబోరు. బప్పి డా ఎప్పటికీ జీవించే ఉంటాడు. మంచి సంగీతం, మధుర క్షణాలను అందించినందుకు ధన్యవాదాలు’ అంటూ ఎమోషనల్ అయ్యాడు. అయితే బప్పి లహిరి జీవితంపై బయోపిక్ తీయాలని పలువురు డైరెక్టర్లు 2019లోనే బప్పి లహిరిని సంప్రదించారు. కానీ అప్పుడు లహిరి ఎటూ తేల్చలేదు. కానీ తన బయోపిక్‌ తీయాల్సి వస్తే రణ్‌వీర్‌ సింగ్ తన చిన్నప్పటి పాత్రలో నటించాలని కోరుకున్నాడు. బప్పీ కూడా ఒక వేదికపై మాట్లాడుతూ ‘నటుడు రణవీర్ సింగ్ బహుశా నా చిన్నప్పటి వెర్షన్‌ను ప్లే చేయగలడు.. మీకు 1970లు, 80, 90ల కాలం తెలుసు’ కదా అంటూ రణ్ వీర్ తో మాట్లాడుతూ తన మనసులోని మాటను వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement