Thursday, April 18, 2024

ప్ర‌భాస్ మూవీలో – దిశాప‌టానీ

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందులో ‘ప్రాజెక్ట్-K’ ఒక‌టి. ‘మ‌హాన‌టి’ ఫేం నాగ్అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న‌ ఈ చిత్రం పాన్ వ‌రల్డ్ సినిమాగా తెర‌కెక్క‌నుంది. దీపికా ప‌దుకొనే హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బ‌చ్చ‌న్ కీల‌క‌పాత్ర‌లో న‌టిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రంలో దిశాప‌టాని కూడా న‌టించ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. ప్రాజెక్ట్‌-K మేక‌ర్స్ దిశాప‌టానికి వెల్‌క‌మ్ చెప్తూ ఫ్ల‌వ‌ర్ బొకేను పంపారు. దీన్ని దిశా ఇన్స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. వైజ‌యంతి మూవీస్ బ్యాన‌ర్‌పై అశ్వినీద‌త్ దాదాపు 500కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నాడు. ప్ర‌స్తుతం షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది ద్వితియార్థంలో విడుద‌ల చేయాల‌ని మేక‌ర్స్ స‌న్నాహాలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement