Thursday, March 28, 2024

ఫైటింగ్ కోసం రూ.20కోట్లు – ప్ర‌భాస్ రేంజ్ ఇదే అంటోన్న ఫ్యాన్స్

ప‌లు ప్రాజెక్టుల‌తో బిజీగా ఉన్నాడు యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్. కాగా స‌లార్ మూవీ ప‌ట్టాలెక్కి షూటింగ్ జ‌రిగిన విష‌యం తెలిసిందే. అయితే యాక్ష‌న్ సీక్వెన్స్ కోసం ఏకంగా రూ.20కోట్లు ఖ‌ర్చు చేస్తున్నార‌ట చిత్ర యూనిట్. ఇందులో దాదాపు 200 మంది ఫైటర్లు పాల్గొనబోతున్నారని అంటున్నారు. అంతేకాదు, దీని కోసం కొందరు విదేశీ ఫైటర్లను కూడా తీసుకు రావాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి సినిమాలో దాదాపు పది నిమిషాల పాటు ఉండే ఒకే ఒక్క ఫైట్ కోసం రూ. 20 కోట్లు ఖర్చు చేస్తుండడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

ప్రభాస్ రేంజ్ అంటే ఆమాత్రం ఉండాల్సిందే అని పలువురు కామెంట్ చేస్తున్నారు. క్రేజీ కాంబినేషన్‌లో రాబోతున్న ‘సలార్’ మూవీలో ప్రభాస్ డుయల్ రోల్ చేస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని హొంబళే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నారు. హాట్ బ్యూటీ శృతి హాసన్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, ఇందులో జ్యోతిక, రమ్యకృష్ణ కీలక పాత్రలను చేస్తున్నట్లు ఆ మధ్య ఓ న్యూస్ బయటకు వచ్చింది. రవి బస్రూర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement