Sunday, December 8, 2024

నితిన్ భార్య‌కి క‌రోనా – బ‌ర్త్ డే ఎలా సెల‌బ్రేట్ చేశారో తెలుసా

క‌రోనా థ‌ర్డ్ వేవ్ ముంచుకొస్తుంది. ఈ నేప‌థ్యంలో సామాన్యుల‌తో పాటు సెల‌బ్రిటీలు కూడా ఈ మ‌హ‌మ్మారిబారిన ప‌డుతున్నారు. కాగా హీరో నితిన్ భార్య శాలిని క‌రోనాకి గురయ్యారు. దాంతో ఆమె ఇంట్లోనే ఐసొలేష‌న్ లో ఉన్నారు. కాగా షాలిని పుట్టిన‌రోజునాడే క‌రోనా బారిన ప‌డ్డారు. దాంతో ఫ్యామిలీ మొత్తం క‌ల‌సి ఆమె బ‌ర్త్ డేని సెల‌బ్రేట్ చేసుకోవ‌డం కుద‌ర‌లేదు. కానీ త‌న భార్య బ‌ర్త్ డేని నితిన్ ఎలాగ‌యినా సెల‌బ్రేట్ చేయాల‌ని భావించాడు. తన భార్యని ఇంట్లో పైగదిలోనే ఉంచాడు. ఇంటి కింద కేక్ కటింగ్ ఏర్పాటు చేశాడు.

ఇదంతా షాలిని గదిలో నుంచి కిటికీలో చూస్తూ ఉంది. నితిన్ కేక్ కట్ చేసి తన భార్యకు బర్త్ డే విషెస్ తెలిపాడు. ఈ వీడియో ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైరల్ ఆ మారింది. ఈ వీడియోని నితిన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. కరోనాకి అడ్డంకులు ఉన్నాయి. కానీ ప్రేమకి లేవు. హ్యాపీ బర్త్ డే మై లవ్. లైఫ్ లో ఫస్ట్ టైం నువ్వు నెగిటివ్ కావాలని కోరుకుంటున్నా’ అంటూ నితిన్ ఆసక్తికర కామెంట్స్ పోస్ట్ చేశాడు. ఈ వీడియో షూట్ చేసింది డైరెక్టర్ వెంకీ కుడుముల అని కూడా నితిన్ కామెంట్ పెట్టాడు. నితిన్ , వెంకీ కుడుముల కాంబోలో వచ్చిన ‘భీష్మ’ చిత్రం సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement