Friday, May 20, 2022

విజ‌య్ ఆంటోనికి జోడీగా – ఫ‌రియా అబ్దుల్లా

జాతిరత్నాలు’ సినిమాతో తొలి ప్రయత్నంలోనే ఈ బ్యూటీ సక్సెస్ తో పాటు మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఇక ఈ సుందరిని వరుసగా అవకాశాలు వరించడం .. ఆమె హవా కొనసాగడం ఖాయమని అంతా అనుకున్నారు.కానీ అలాంటిదేమీ జరగలేదు. రవితేజ సినిమా ‘రావణాసుర’లో ఆ ఐదుగురు హీరోయిన్స్ లో ఆమె ఒకరుగా కనిపించనుంది. ఇక ఆ తరువాత చేతిలో ప్రాజెక్టులు లేవు. కోలీవుడ్ బాట‌ప‌ట్టింది హీరోయిన్ ఫ‌రియా అబ్దుల్లా. తమిళంలో విజయ్ ఆంటోని హీరోగా ఒక సినిమా రూపొందుతోంది. ఆ సినిమాలో ఆయన సరసన నాయికగా ఆమె నటించనుందని అంటున్నారు. సుశీంద్రన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాలో ఫరియా పల్లెటూరి యువతిగా కనిపించనుందని అంటున్నారు. తమిళంతో పాటు తెలుగులోను ఈ సినిమా విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement