Thursday, April 25, 2024

హలో గోవా.. పిక్స్ షేర్ చేసిన సారా తెందుల్కర్..

సచిన్ తెందుల్కర్ కూతురు సారా ప్రస్తుతం గోవా విహార యాత్రలో ఉంది. తన టూర్ కు సంబంధించిన ఫొటోలను ఇన్ స్టా, ట్విట్టర్ లో షేర్ చేస్తూ సంతోషాన్ని అభిమానులతో పంచుకుంటోంది.  కాగా ఆ ఫొటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ బ్యుటిఫుల్ గర్ల్ సోషల్ మీడియాలో యమ యాక్టింగ్ గా ఉంటోంది. ఫొటోలు, వీడియోలతో నెటిజన్లకు ఎప్పటికప్పుడు అప్ డేట్స్ ఇస్తుంటుంది. ప్రస్తుతం సారా తెందుల్కర్ కు ఇన్ స్టా గ్రామ్ లో 1.6 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

అందమైన ఫ్లవర్ డిజైన్ తో ఉన్న డ్రెస్ లో మురిసిపోతున్నతన ఫొటోని పోస్ట్ చేసింది సారా. ఆమె చేతిలో గులాబీల ఫ్లవర్ బొకె పట్టుకుని నవ్వుతున్న ఈ పొటోని షేర్ చేస్తూ.. “హలో గోవా” ట్యాగ్ లైన్ తో చేసిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ ఫొటోని షేర్ చేసిన తర్వాత 3.3 లక్షల మంది లైక్ చేశారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్‌,  ట్విట్టర్    పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement