Thursday, March 28, 2024

కేఎల్ రాహుల్ కి స‌ర్జ‌రీ పూర్తి-ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాన‌ని ట్వీట్

క్రికెట‌ర్ కేఎల్ రాహుల్ కి స‌ర్జ‌రీ విజ‌య‌వంతంగా పూర్త‌యింది. జ‌ర్మ‌నీ వైద్యులు ఈ శ‌స్త్ర చికిత్స‌ని విజ‌య‌వంతంగా పూర్తి చేశారు.
కాగా తన ఆరోగ్య పరిస్థితి కుదుటపడుతున్నట్టు స్వయంగా రాహుల్ తెలిపారు. అతడికి గజ్జ భాగంలో ఈ శస్త్రచికిత్స జరిగింది. దక్షిణాఫ్రికాతో ఐదు టీ20ల సిరీస్ కు కెప్టెన్ గా వ్యవహరించాల్సిన రాహుల్ ఉన్నట్టుండి గాయంతో తప్పుకోవడం తెలిసిందే. అందరికీ హెలో.. కొన్ని వారాల నుంచి కష్టంగా ఉంది. కానీ సర్జరీ విజయవంతమైంది. నా గాయం మానుతోంది. చక్కగా కోలుకుంటున్నాను. కోలుకునే క్రమం మొదలైంది. మీ సందేశాలకు, ప్రార్థనలకు ధన్యుడను. త్వరలోనే మీ అందరినీ చూస్తాను అంటూ ట్విట్టర్ లో రాహుల్ పోస్ట్ పెడుతూ, తాను ఆసుపత్రి బెడ్ పై నవ్వుతూ ఉన్న ఫొటోను షేర్ చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement