Wednesday, April 24, 2024

గోల్డెన్ టెంపుల్ కి.. భారీ భ‌ద్ర‌త‌

రీసెంట్ గా పంజాబ్ లోని గోల్డెన్ టెంపుల్ ప‌రిస‌ర ప్రాంతాల్లో మూడుసార్లు పేలుళ్లు చోటు చేసుకున్నాయి. ఈ నేథ్యంలో శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ (ఎస్జీపీసీ) ఆధ్వర్యంలో కాంప్లెక్స్, హెరిటేజ్ స్ట్రీట్ చుట్టుపక్కల భద్రత కట్టుదిట్టం చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే గల్లియారా వద్ద 50 హై రిజల్యూషన్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. భక్తులు, సందర్శకుల భద్రత కోసం అన్ని ప్రవేశ ద్వారాల వద్ద స్కానర్లు ఏర్పాటు చేయనున్నారు. మహిళలను తనిఖీ చేసేందుకు ప్రత్యేకంగా మహిళా సిబ్బందిని నియమించారు. వీటితో పాటు ఆలయ ప్రాముఖ్యత, కాంప్లెక్స్ లో పాటించాల్సిన మర్యాదలు (సిద్ధాంతాలు) తో పాటు పలు భాషల్లో ‘చేయవలసినవి, చేయకూడనివి తెలిపేలా భారీ ఎల్ ఈడీ స్క్రీన్ ను ఏర్పాటు చేశారు.

స్వర్ణదేవాలయం పరిసరాల్లో ఇటీవల తక్కువ తీవ్రతతో పేలుళ్లు జరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్జీపీసీ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం ఆలయంలోని అన్ని ప్రవేశ ద్వారం వద్ద భక్తులను ఎస్జీపీసీ టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీ చేస్తున్నారు. అయితే స్వర్ణ దేవాలయంలోని అన్ని ప్రవేశ ద్వారాల వద్ద బాడీ, లగేజీ స్కానర్లను ఏర్పాటు చేయాలని కొంతకాలం క్రితం జరిగిన ఎస్జీపీసీ కార్యవర్గ సమావేశంలో నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇందులో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూస్తామని అధికారులు చెప్పారు. ఇదిలా ఉండగా ఇటీవల గోల్డెన్ టెంపుల్ సమీపంలో మొదటి పేలుడు మే 6న చోటు చేసుకుంది. మే 8వ తేదీన రెండో పేలుడు సంభవించింది. మే 11వ తేదీన మూడో పేలుడు జరిగింది. ఆయా ఘటనలకు పాల్పడినట్టుగా భావిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నామని, ఈ కేసులను ఛేదించామని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement