Thursday, August 5, 2021

తెలంగాణలో రెడ్ అలర్ట్ ప్రకటించిన జిల్లాలు ఇవే..

వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతో తెలంగాణవ్యాపత్గా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనానికి అనుభందంగా ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి సగటున  7.6 కి మీ ఎత్తు వరకు కొనసాగుతోంది. దీని ప్రభావంతో వచ్చే 48 గంటల పాటు తెలంగాణలో  తేలికపాటి నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని అసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

మరోవైపు సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, సిద్ధిపేట, కామారెడ్డి, వరంగల్, హన్మకొండ, అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలతోపాటు పలుచోట్ల ఉరుములు, మెరుపుల అలజడి ఉంటుందని, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: పెరిగిన అమెరికా టికెట్‌ రేట్లు.. విద్యార్థులపై భారం

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News