Friday, April 19, 2024

నల్గొండ జిల్లాలో వర్షం బీభత్సం… రాకపోకలు బంద్

నల్లగొండ జిల్లాలో భారీ వాన బీభత్సం సృష్టించింది. గురువారం రాత్రి భారీ వర్షం కురియడంతో చండూరు, మునుగోడు మండలాల్లో పలు వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. చండూరు మండలంలోని బంగారిగడ్డ, అంగడిపేట, బోడంగిపర్తి, చండూరు వద్ద వాగులు ఉగ్రరూపం దాల్చాయి. దీంతో చండూరు, హైదరాబాద్‌ వైపు, చండూరు, మునుగోడు వైపు రాకపోకలు నిలిచిపోయాయి. అదేవిధంగా శిర్దేపల్లి, గొల్లగూడెం వెళ్లే రోడ్డు పూర్తిగా తెగిపోయింది. మొత్తంగా గట్టుప్పల్‌, మునుగోడు, నాంపల్లి వైపు నుంచి చండూరుకు రావాల్సిన అన్ని దారులు స్తంభించిపోయాయి.

మునుగోడు మండలంలోని కొరటికల్, మునుగోడు మండల కేంద్రంలోని మర్రివాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నది. భారీ వర్షాలు కురవడం వల్ల పత్తి పంటలో నీళ్లు చేరాయని, తెగుళ్ల బారిన పడే అవకాశం ఉందని రైతలు ఆందోళన చెందుతున్నారు. 

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉదయం నుంచి మోస్తరు వర్షం కురుస్తోంది. బీబీనగర్, వలిగొండ మండలాల్లో ముసురు కమ్ముకుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో మూసి నదికి వరద పోటెత్తింది. యాదాద్రి భువనగిరి జిల్లాలోని సంగెం – బొల్లెపల్లి గ్రామాల మధ్య ఉన్న భీమలింగం వద్ద లోలెవెల్ రోడ్డు బ్రిడ్జిపై నుంచి మూసి నది ప్రవహిస్తుంది. 

Advertisement

తాజా వార్తలు

Advertisement