Saturday, April 20, 2024

ALERT: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. వడగళ్ల వాన పడే అవకాశం

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 24 గంటల్లో కోస్తాతోపాటు రాయలసీమలో అక్కడక్కడ వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. కోస్తాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరో మూడు రోజులు అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయని తెలిపింది.

గుంటూరు, కృష్ణా, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో గురువారం భారీ వర్షాలు కురిశాయి. విజయవాడ, విశాఖ నగరాల్లోని పలుచోట్ల వీధులు, రోడ్లు జలమయమయ్యాయి.

మరోవైపు తెలంగాణలోనూ వర్షాలు పడుతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గత నాలుగు రోజులుగా వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ సహా నిజామాబాద్, కామారెడ్డి, కరీంనగర్, మెదక్, వికారాబాద్ తదితర జిల్లాల్లో వర్షాలు పడ్డాయి. పలు జిల్లాల్లో పంటలకు తీవ్ర నష్టం జరిగింది. వర్షాల నేపథ్యంలో రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement