Thursday, April 25, 2024

Breaking: హైదరాబాద్​లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం..

హైదరబాద్​లో ఇవ్వాల (ఆదివారం) సాయంత్రం నుంచి కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురుస్తుండగా.. మరికొన్ని చోట్ల భారీ వర్షం పడుతోంది. ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కురుస్తున్నాయి. సాయంత్రం 5 గంటల దాకా హాట్​ హాట్​​గా ఉన్న వెదర్ ఆ తర్వాత మారిపోయింది. ఆకాశంలో నల్లని కారుమేఘాలు కమ్ముకున్నాయి.

అంతేకాకుండా.. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రేపు, ఎల్లుండి వర్షాలుంటాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరికలు  జారీ చేసింది. ఇక.. ఇవ్వాల జూబ్లీహిల్స్​, బంజారాహిల్స్​, పెద్ద అంబర్​పేట్,​ హయత్​నగర్​, వనస్థలిపురం, ఎల్బీనగర్,​ మన్సూరాబాద్​, దిల్​సుఖ్​నగర్​, చైతన్యపురి, కొత్తపేట, టోలీచౌకి, గచ్చిబౌలి, అప్పా జంక్షన్​తోపాటు అవుట్​ రింగ్​ రోడ్​  వంటి పలు ఏరియాల్లో వర్షం కురుస్తోంది. దీంతో వాహనదారులు ఎక్కడికక్కడ నిలిచిపోయారు. గచ్చిబౌలి, హైటెక్​సిటీ వంటి  పలు చోట్ల ట్రాఫిక్​ జామ్​ అయ్యింది.  

Advertisement

తాజా వార్తలు

Advertisement