Tuesday, December 5, 2023

Breaking: హైద‌రాబాద్ సిటీలో కుండ‌పోత వ‌ర్షం .. గంట‌పాటు దంచికొట్టిన వాన‌!

హైద‌రాబాద్ సిటీలో కుండ‌పోత వ‌ర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, సోమాజీగూడ‌, అమీర్‌పేట్‌, స‌హా ప‌లు ఏరియాల్లో భారీ వ‌ర్షం కురుస్తోంది. ఉరుములు, మెరుపుల‌తో ఆకాశం ద‌డ ద‌డ‌లాడుతోంది. కుండ‌పోత వాన‌తో రోడ్ల‌న్నీ జ‌ల‌మ‌యం అయ్యాయి. లోత‌ట్టు ప్రాంతాల‌న్నీ నీళ్ల‌తో నిండిపోయాయి. మెహిదీప‌ట్నం-మాస‌బ్‌ట్యాంకు వ‌ర‌కు భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. మూసీ పరివాహ‌క ప్రాంతంలో ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని జీహెచ్ ఎంసీ అధికారులు సూచించారు. గంట సేప‌టి నుంచి భారీ వ‌ర్షం కురుస్తుండ‌డంతో వాహ‌నాలు రోడ్ల‌మీద ఎక్క‌డిక‌క్క‌డ నిలిచిపోవ‌డంతో సిటీలోని ప‌లు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. మ్యాన్స్ హోల్స్ ఉప్పొంగుతుండ‌డంతో వాహ‌న‌దారులు జాగ్ర‌త్త‌గా వెళ్లాల‌ని పోలీసులు కోరుతున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement