Sunday, October 6, 2024

Floods: గోదావరి, కృష్ణా నదులకు భారీగా ఇన్​ఫ్లోలు.. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక

గోదావరి, కృష్ణా నదులకు పెద్ద ఎత్తున వరద ప్రవాహం కొనసాగుతోంది. నాగార్జున సాగర్​ ప్రాజెక్టు 16 క్రస్ట్​ గేట్లు 10 అడుగల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్​కు ఇన్​ఫ్లో 3.14లక్షల క్యూసెక్కులు వస్తోంది. అవుట్​ ఫ్లో 2.82 లక్షల క్యూసెక్కులుగా ఉంది. సాగర్​ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 588.70 అడుగులు ఉంది.

సాగర్​ పూర్తిస్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలకు గాను, ప్రస్తుత నీటి నిల్వ 308.1702 టీఎంసీలకు చేరింది. గోదావరిలోనూ వరదప్రవాహం కొనసాగుతోంది. దీంతో భద్రచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 51.5 అడుగులకు నీటి మట్టం చేరుకుంది. ఇన్​ఫ్లో 13.43లక్షల క్యూసెక్కులు, ధవళేశ్వరం దగ్గర కూడా వరద పోటెత్తుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement