Thursday, April 25, 2024

గ‌డ్డంతో యువ‌తిని పైకి లేపి రికార్డ్ సృష్టించిన ఆంటాన‌స్ కొంట్రిమాస్..

గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డ్ కి ఎక్కేందుకు ఎన్నెన్నో పాట్లు, ఫీట్లు ప‌డుతుంటారు. ఇప్ప‌టికే ప‌లు రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడో కొత్త రికార్డ్ ని సృష్టించాడు ఓ వ్య‌క్తి. గ‌డ్డంతో ఒక మ‌నిషిని పైకి లేపి రికార్డ్ ని న‌మోదు చేశాడు. ఈ సంఘ‌ట‌న యూర‌ప్‌లోని లిథువానియాలో చోటు చేసుకుంది..లిథువానియాకి చెందిన ఆంటాన‌స్ కొంట్రిమాస్ ఈ సాహ‌సానికి ఒడిగ‌ట్టాడు. 63.80 కిలోల బ‌రువు ఉన్న ఓ యువ‌తి ఓ టేబుల్ మీద ప‌డుకొని అత‌డి గ‌డ్డాన్ని ప‌ట్టుకోగా.. ఆ యువ‌తిని ఎటువంటి స‌పోర్ట్ లేకుండా.. కేవ‌లం గ‌డ్డంతోనే ఆ యువ‌తిని పైకి లేపి గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డ్‌ను సాధించాడు.

ఆ వ్య‌క్తి చేసిన సాహసానికి సంబంధించిన వీడియోను గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డ్ ప్ర‌తినిథులు.. త‌మ సోష‌ల్ మీడియా అకౌంట్ల‌లో షేర్ చేశారు. దీంతో ఆ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. మీరు మీ గ‌డ్డానికి ఏ ఆయిల్ వాడుతారు. వామ్మో.. ఎంత స్ట్రాంగ్ గ‌డ్డ‌మో.. అంటూ నెటిజ‌న్లు ఫ‌న్నీగా కామెంట్లు చేస్తున్నారు.నిజానికి.. కొంట్రిమాస్ 2013లోనే ఈ రికార్డును క్రియేట్ చేశాడు. అప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు కూడా అత‌డి రికార్డును ఎవ్వ‌రూ బ్రేక్ చేయ‌లేదు. 2021 లో కూడా అదే గ‌డ్డంతో అదే వెయిట్ ఉన్న యువ‌తిని పైకి లేపి.. మ‌రోసారి గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డును ప‌దిలం చేసుకున్నాడు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement