Saturday, April 20, 2024

వడగాలులు.. బయటకు వెళ్తే అంతే!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఇవాళ, రేపు వడగాలులు వీచే అవకాశాలున్నాయని వాతావరణశాఖ ప్రకటించింది. పలు జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఉష్ణోగ్రత సాధారణం కన్నా 3 డిగ్రీలు అదనంగా పెరిగే సూచనలున్నాయని తెలిపింది.

ఉత్తర, వాయువ్య భారతం నుంచి తక్కువ ఎత్తులో పొడిగాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో శని, ఆదివారాల్లో వడగాలులు వీచే అవకాశాలున్నాయని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. ఆదిలాబాద్, నిజామాబాద్, సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, నాగర్‌కర్నూల్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అవసరం అయితే తప్ప బయటకు రావొద్దని సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement