Friday, March 29, 2024

Kerala: కన్నూరు వీసీ ఓ క్రిమినల్​.. తీవ్ర ఆరోపణలు చేసిన గవర్నర్​ ఆరిఫ్​ మహ్మద్​ ఖాన్​!

కేరళ గవర్నర్​ ఆరిఫ్​ మహ్మద్​ ఖాన్​ సంచలన వ్యాఖ్యలు చేశారు. కన్నూర్​ యూనివర్సిటీ వైస్​ చాన్స్​లర్​ (వీసీ) గోపీనాథ్​ రవీంద్రన్​ని ఓ క్రిమినల్​గా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలు కేరళ రాష్ట్రంలోని అధికార సీపీఐ(ఎం) నేతృత్వంలోని ఎల్​డీఎఫ్​ (లెఫ్ట్​ డెమక్రాటిక్​ ఫ్రంట్​) ప్రభుత్వానికి మింగడు పడడం లేదు. దీంతో గవర్నర్​ ఖాన్​ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు పలువురు పార్టీ నేతలు.

ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆరిఫ్ మహ్మద్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ తనను కన్నూర్ యూనివర్సిటీకి ఆహ్వానించినప్పుడు రవీంద్రన్ తనపై కుట్ర పన్నారని, దాడికి యత్నించారని ఆరోపించారు. 2019 డిసెంబర్‌లో కన్నూర్ యూనివర్సిటీ నిర్వహించిన ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్‌ను ప్రారంభించేందుకు తాను వెళ్లినప్పుడు పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)కి అనుకూలంగా ఉన్నందుకు తనను ఇబ్బంది పెట్టారని ఆరిఫ్ మహ్మద్ ఖాన్ ఆరోపించారు. తనను శారీరకంగా దెబ్బతీసేందుకు జరిగిన కుట్రలో భాగస్వామ్యుడు వీసీ అని, అతను నేరస్థుడు అని, రాజకీయ కారణాలతో వీసీగా నియామకం అయ్యాడని ఆరోపించారు గవర్నర్​ ఖాన్​. తనను అక్కడికి ఆహ్వానించిన సందర్భంలో తనపై దాడి జరిగినప్పుడు ఆయన పోలీసులకు రిపోర్టు కూడా చేయలేదని చెప్పారు.

అయితే దీనిపై వామపక్షాలు స్పందించాయి. అధికార CPI(M) రాష్ట్ర సెక్రటేరియట్, LDF వేర్వేరు ప్రకటనలలో కన్నూర్ V-C పై ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ చేసిన వ్యాఖ్యను అత్యంత అభ్యంతరకరంగా పేర్కొన్నాయి. వీసీ చేసిన నేరం ఏమిటో ఖాన్ స్పష్టం చేయాలని సీపీఐ(ఎం) పేర్కొంది. వీసీపై ఖాన్ చేసిన నేరపూరిత వ్యాఖ్యను చూస్తుంటే గవర్నర్ కార్యాలయాన్ని దుర్వినియోగం చేశారని ఎల్‌డిఎఫ్ కన్వీనర్ ఈపీ జయరాజన్ ఆరోపించారు. కన్నూర్‌ వీసీ పార్టీ కేడర్‌లా వ్యవహరిస్తున్నారంటూ గవర్నర్‌ చేసిన ఆరోపణ నిరాధారమైనదని జయరాజన్‌ అన్నారు.

అంతేకాకుండా ఈ వ్యాఖ్యలపై బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు కూడా స్పందించాయి. తనపై దాడికి కుట్ర జరిగిందని ఆరిఫ్ మహమ్మే ఖాన్ చేసిన ఆరోపణలపై విచారణ జరిపించాలని కాంగ్రెస్, బీజేపీ కోరాయి. కాంగ్రెస్ నాయకుడు రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు (ఎల్‌ఓపి) వీడీ సతీశన్ మాట్లాడుతూ.. “దీనిపై దర్యాప్తు చేయాలి. తనపై దాడికి కన్నూర్ వీసీ ప్లాన్ చేశారని గవర్నర్ ఆరోపిస్తే దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. అది రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత.. వారు ఒక ఉన్నత స్థాయి అధికారిని నియమించి ఆరోపణలపై దర్యాప్తు చేయాలి” అన్నారు. ఇక.. తనపై దాడికి కుట్ర పన్నారనే గవర్నర్ ఆరోపణలపై సీనియర్ పోలీసు అధికారుల బృందంతో విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement