Tuesday, March 26, 2024

Breaking: హర్యానా క్రీడామంత్రి సందీప్ సింగ్ రాజీనామా

లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో హర్యానా రాష్ట్ర క్రీడామంత్రి సందీప్ సింగ్ రాజీనామా చేశారు. మంత్రి సందీప్ సింగ్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఓ సర్టిఫికేట్ విషయంలో వ్యక్తిగతంగా కలవాలని పిలిచిన మంత్రి సందీప్ సింగ్ తనను లైంగికంగా వేధించారని మహిళా కోచ్ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహిళా కోచ్ ఫిర్యాదుతో చండీగఢ్ పోలీసులు మంత్రిపై కేసు నమోదు చేశారు. కాగా ఈ ఘటనపై విచారణ చేయాలని హర్యానా ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement