Saturday, June 3, 2023

అమిత్ షా కాదు అబద్ధాలకు బాద్ షా..

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హ‌రీశ్‌రావు తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. అమిత్ షా కాదు అబద్ధాల షా అని అన్నారు. అలవోకగా అబద్ధాలు మాట్లాడారని, జూటా మాటలు చెప్పి వెళ్లారని మండిపడ్డారు. తెలంగాణలో నీ అబద్ధాలు చెల్లవన్నారు. ఆర్టికల్ 370 రద్దుకు మద్దతు ఇవ్వలేదని అన్నారు అని, ఆర్టికల్ 370 రద్దుకు టీఆరెఎస్ మద్దతు తెలిపిందని, తమ ఎంపీలు ఓటు కూడా వేశారని గుర్తు చేశారు.

మిషన్ భగీరథకు కేంద్రం రూ. 2500 కోట్లు ఇచ్చిందని ప్రచారం చేశారు.. 2 రూపాయలు అయినా ఇచ్చారా ? ప్రశ్నించారు. సొంత ఖర్చులతో పథకం అమలు చేస్తున్నామన్నారు. మంచి ఫలితాలు ఇంచిందని కేంద్రం కూడా చెప్పిందని గుర్తు చేశారు. ఫ్లోరైడ్ రహిత రాష్ట్రంగా మారిందని కేంద్రం చెప్పిన విషయాన్ని హరీష్ గుర్తు చేశారు.

- Advertisement -
   

ఆయుష్మాన్ భారత్ అమలు కావడం లేదన్న అమిత్ షా వ్యాఖ్యాను ఖండించారు. 18, మే 2021 నుండి రాష్ట్రంలో అమలు చేస్తున్నామన్నారు. ఒకరేమో అమలు అవుతుంది అంటారు.. మరొకరు కాదు అంటారు పచ్చి అబద్దం మాటలు అని మండిపడ్డారు. ఇప్పటి వరకు ఈ పథకం కింద 3.62 వేల మందికి చికిత్స అందించినట్లు వివరించారు. రూ. 850 కోట్లు ఖర్చులో కేంద్రం 150 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. తెలంగాణ 700 కోట్లు ఖర్చు చేసిందన్నారు.

రాష్ట్రలో సూపర్ స్పెషాలిటి ఆసుపత్రులకు 2,679 కోట్లకు శంకుస్థాపన చేశామన్నారు. రాష్ట్ర బిజెపి నాయకులు ఈ విషయాన్ని చెప్పలేదా? అని నిలదీశారు. నీతి అయోగ్ సుచిలో తెలంగాణ మూడో స్థానంలో ఉందన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలలలో ఇంగ్లీష్ మీడియం తెస్తున్నదని చెప్పారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement