Friday, March 29, 2024

ఢిల్లీ న‌డి వీధిలో.. యువ‌తికి వేధింపులు

దేశ రాజ‌ధాని ఢిల్లీలో న‌డి వీధిలో ఓ యువ‌తి వేధింపుల‌కి గురైంది. ఈ ఘ‌ట‌న ఢిల్లీలో సంచ‌ల‌నంగా మారింది.ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మంగోల్‌పురి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం.. తొలుత ఓ యువతి క్యాబ్‌లోంచి దిగిపోయింది. అయితే.. అదే కారులో ఉన్న ఓ యువకుడు కారు దిగిన ఆమెను షర్ట్ పట్టి బలవంతంగా కారులోకి తోశాడు.

ఆ సమయంలో కారులో ఇద్దరు యువకులు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో కలకలం రేపింది. దేశ రాజధానిలో మహిళలకు భద్రత కరువైందంటూ పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఢిల్లీ ఔటర్ డిస్ట్రిక్ట్ డీసీపీ స్పందించారు. పూర్తి వివరాలు తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించామన్నారు. క్యాబ్ డ్రైవర్ అడ్రస్ కనుగొన్నామని, అతడితో పోలీసులు త్వరలో మాట్లాడతారని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement