Saturday, April 20, 2024

ధోనీ బ‌ర్త్ డే – స్పెష‌ల్ ఫొటో పోస్ట్ చేసిన ప‌రిటాల శ్రీరామ్

టిడిపి యువ‌నేత ప‌రిటాల శ్రీరామ్ ..క్రికెట‌ర్ మ‌హేంద్ర సింగ్ ధోనీకి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు చెబుతూ సోష‌ల్ మీడియాలో ఓ ఫొటోను పోస్ట్ చేశారు. టీమిండియా జెర్సీలో అటు తిరిగి నిల‌బ‌డి ఉన్న ధోనీ ఫొటోకు అభిముఖంగా ఉన్న గోడ‌పై ధోనీకి చెందిన ప‌లు ఫొటోల‌ను అతికించిన ఫొటోను ప‌రిటాల శ్రీరామ్ త‌న పోస్ట్‌కు జ‌త చేశారు. ఆయా సిరీస్‌ల‌లో టీమిండియాను విజ‌య‌ప‌థంలో న‌డిపి క‌ప్‌ల‌ను అందుకుంటున్న ధోనీ ఫొటోలు అందులో ఉన్నాయి. ప‌రిటాల శ్రీరామ్ పోస్ట్ చేసిన ఈ ఫొటో ప‌లువురిని ఆక‌ట్టుకుంటోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement