Friday, April 19, 2024

Breaking: ఏషియన్‌ గేమ్స్‌ వాయిదా

ఈ ఏడాది జరగాల్సిన ఏషియన్‌ గేమ్స్‌ వాయిదా పడ్డాయి. ఆథిత్య దేశమైన చైనా ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఏషియన్ గేమ్స్ ను వాయిదా వేశారు. అయితే క్రీడలను మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామన్న విషయాన్ని వెల్లడించలేదు.

హాంగ్జూ పట్టణంలో సెప్టెంబర్‌ 10 నుంచి 25 వరకు ఏషియన్‌ గేమ్స్‌ జరగాల్సి ఉన్నాయి. అయితే చైనాలో కరోనాకు కేంద్రంగా ఉన్న షాంఘైకి సమీపంలోనే హాంగ్జూ పట్టణం ఉన్నది. షాంఘైలో దేశం రికార్డు స్థాయిలో రోజువారీ కేసులతో పోరాడుతోంది. కరోనా వ్యాప్తిని నిలువరించడానికి షాంఘైలో గత కొన్ని వారాలుగా కఠినంగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement