Wednesday, April 24, 2024

సింహ‌న్ని చేతుల్లో బంధించిన మ‌హిళ – వైర‌ల్ గా వీడియో

ఎవ‌రికైనా సింహాన్ని చూస్తే వెన్నులో వ‌ణుకు రావాల్సిందే. అలాంటిది ఏకంగా సింహాన్ని చేతుల్లోకి తీసుకుని సంచ‌ల‌నాన్ని సృష్టించింది ఓ మ‌హిళ‌. ఈ వీడియో ఇప్పుడు వైర‌ల్ గా మారింది. ఈ ఘ‌ట‌న కువైట్ లో చోటు చేసుకుంది. ఓ సింహం దారిత‌ప్పి ఏకంగా ప్ర‌జ‌లు నివాసం ఉంటోన్న వీధుల్లోకి వ‌చ్చింది. సింహంని చూసి చాలా మంది హ‌డ‌లిపోయారు. అయితే ఆ సింహనికి ఎదురువెళ్ళ‌డ‌మే కాదు ఏకంగా త‌న చేతుల్లో బంధించిందామె. దాంతో సింహం గ‌ర్జిస్తూ ఆమె చేతుల నుండి విడిపించుకునేందుకు ప్ర‌య‌త్నించింది. దాంతో ఆ మ‌హిళ సింహాన్ని రహ‌దారిపై వ‌దిలి కూల్ గా న‌డుచుకుంటూ వెళ్లిపోయింది. ఈ వీడియో తెగ వైర‌ల్ అవుతోంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement