Thursday, April 18, 2024

అమెజాన్ ప్రైమ్ చేతిలో – ఏజెంట్ మూవీ డిజిట‌ల్ హ‌క్కులు

హీరో అక్కినేని అఖిల్ కెరీర్ లో ఏజెంట్ చిత్రం అత్యంత భారీ బడ్జెట్‌తో తెర‌కెక్కుతోంది.. ఈ చిత్రం ఓటిటి డీల్ లాక్ అయ్యింది. ఏజెంట్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియోస్ దక్కించుకుంది. ఏ రేటుకు ఈ డీల్ లాక్ అయిందనేది ప్రస్తుతానికి బయటకు రాలేదు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో అఖిల్, ఇంటర్ పోల్ ఏజెంట్ గా కనిపించబోతున్నారు. హాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ‘బోర్న్ ఐడెంటిటీ’ ఈ సినిమాకి ఆధారమని తెలుస్తోంది. ఇక ఏజెంట్ చిత్రాన్ని ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తగా భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఈ సినిమాలో అఖిల్ తొలిసారి సిక్స్‌ప్యాక్ బాడీతో మనకు కనిపించ‌నున్నారు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది. త్వరలోనే టీజర్ రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేయబోతున్నారు. ఈ సినిమాని అనిల్ సుంకర- ఎకె ఎంటర్ టైన్మెంట్స్ – సురేందర్ 2 సినిమా బ్యానర్స్‌లో రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. వక్కంతం వంశీ కథ అందిస్తున్నారు..మ్యూజిక్ సెన్షేషన్ థమన్ సంగీతమందిస్తున్నారు. సురేంద‌ర్ రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్ర‌త్యేక పాత్ర‌లో మ‌మ్ముట్టి న‌టిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement