Friday, March 29, 2024

హాఫ్ హెల్మెట్ పెట్టుకున్న పోలీసు..ఫైన్ వేసిన మరో ట్రాఫిక్ పోలీసు

పలు సందర్భాల్లో పోలీసులు తమ డిపార్ట్ మెంట్ ఉద్యోగులు ట్రాఫిక్ రూల్స్ పాటించకపోయినా చూసి చూడనట్లు వదిలేస్తుంటారు. కానీ కొన్ని సందర్భాల్లో నిబంధనలు పాటించకపోతే పోలీసు ఉన్నతాధికారుల వాహనాలకూ ఫైన్లు వేయడం వంటి విషయాలు కూడా జరుగుతుంటాయి. అయితే అలాంటి సందర్భాల్లో వాటి ఫొటోలు బయటకు వచ్చి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.  తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. హాఫ్ హెల్మెట్ ధరించినందుకు బెంగళూరు ట్రాఫిక్ పోలీసు సిబ్బంది మరో పోలీసుకు జరిమానా విధించారు.

ఇప్పుడు ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఫైన్ వేసిన ఆ పోలీసు తీరును నెటిజన్లు అభినందిస్తున్నారు. బెంగళూరు ఆర్ టీ నగర్ ట్రాఫిక్ బీటీపీ ఓ గేర్ లెస్ స్కూటర్‌ను నడుపుతున్నారు. అయితే ఆ సమయంలో ఆయన ఆ సిటీ రోడ్ లలో నిషేధంలో ఉన్న హాఫ్ హెల్మెట్ ధరించి ఉన్నారు. దీనిని గమనించిన మరో పోలీసులు ఆయన వాహనాన్ని ఆపారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు ఆ పోలీసులకు ఫైన్ విధించారు. ఈ ట్రాఫిక్ చలాన్ జారీ చేసిన ఫొటోను ఆయన ట్విట్టర్ లో పోస్టు చేశారు. ఆర్టీ నగర్ ట్రాఫిక్ పోలీస్ అనే ట్విట్టర్ పేజీలో ఆయన ‘‘గుడ్ ఈవినింగ్.. పోలీసులపై హాఫ్ హెల్మెట్ కేసు బుక్’’ అని క్యాప్షన్ పెట్టి ఫొటో అప్ లోడ్ చేశారు. దీంతో ఈ ఫొటో వైరల్ గా మారింది. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారిని విడిచిపెట్టకుండా పోలీసులు తీసుకున్న చర్యను నెటిజన్లు ప్రశంసించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement