Thursday, April 18, 2024

Ashwin Kotwal: కాంగ్రెస్ పార్టీకి షాక్.. బీజేపీలో చేరనున్న ఎమ్మెల్యే

వరుస ఓటములతో నిరాశలో ఉన్న కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. గుజరాత్ ఎమ్మెల్యే అశ్విన్ కొత్వాల్ మంగళవారం పార్టీకి రాజీనామా చేశారు. ఆయన బిజెపిలో చేరనున్నారు. గిరిజన ఎమ్మెల్యే కొత్వాల్ మంగళవారం ఉదయం గుజరాత్ అసెంబ్లీ స్పీకర్ నీమాబెన్ ఆచార్యకు తన రాజీనామాను సమర్పించారు. త్వరలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.. ఆయన రాజీనామా చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

కాగా, గుజరాత్ బీజేపీ ప్రధాన కార్యాలయం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్ పాటిల్ సమక్షంలో ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉంది. కాగా, మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉన్న కొత్వాల్ ఖేద్‌బ్రహ్మ నియోజకవర్గంలోని గిరిజన రిజర్వ్‌డ్ స్థానం నుంచి ఎన్నికయ్యారు. గుజరాత్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ విప్‌గా పనిచేశారు. గత కొంత కాలంగా తనకు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పదవి ఇవ్వకపోవడంతో కొత్వాల్ కాంగ్రెస్‌పై అసంతృప్తితో ఉన్నారు.

‘’నేను 2007 నుంచి గుజరాత్‌లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా పని చేస్తున్నాను. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఆయన పని తీరు చూశాను. ఆయన చేపట్టని సంక్షేమ పథకలకు ఆకర్షితుడయ్యాను. కానీ భావజాలం కారణంగానే కాంగ్రెస్‌లో కొనసాగాను’ అని కొత్వాల్ అన్నారు. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న గిరిజ‌నులు బాగుప‌డాలంటే తాను బీజేపీలో చేర‌క తప్ప‌డం లేదు. బీజేపీ వ‌ల్లే గిరిజ‌నుల అభివృద్ధి సాధ్య‌మ‌ని తాను న‌మ్ముతున్నాన‌ని కొత్వాల్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement