Wednesday, April 24, 2024

గుజరాత్ బోర్డ్ 12వ సైన్స్ పరీక్ష ఫలితాలు

గుజరాత్ సెకండరీ అండ్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ (GSHSEB) రాష్ట్ర 12వ సైన్స్ ఫలితాలను గురువారం విడుదల చేసింది. పరీక్షకు హాజరైన విద్యార్థులు gseb.org బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చు. దీని కోసం అభ్యర్థులకు రోల్ నంబర్ .. ఇతర వివరాలు అవసరం..గుజరాత్ ప్రభుత్వంలో విద్య, సైన్స్ అండ్ టెక్నాలజీ కేబినెట్ మంత్రి జితు వాఘాని సైన్స్ పరీక్ష ఫలితాల తేదీని తెలియజేశారు. గుజరాత్ 12వ సైన్స్ ఫలితాలు మే 12న ఉదయం 10 గంటలకు విడుదలవుతాయని ఆయన ట్వీట్ చేశారు. ఈ ఉదయం నుంచి ఫలితాలు వెలువడ్డాయి. అయితే, 12వ ఆర్ట్స్ అండ్ కామర్స్ ఫలితాలు ఎప్పుడు ప్రకటిస్తారనే దానిపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. గుజరాత్ 12వ తరగతి సైన్స్ పరీక్ష మార్చి 28 మరియు ఏప్రిల్ 8 మధ్య నిర్వహించబడింది. ఈ సమయంలో, కోవిడ్-19 ప్రోటోకాల్‌లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement