Thursday, April 18, 2024

త‌న పెళ్లి కోసం.. ఫ్లైట్ ని బుక్ చేసిన వ‌రుడు

పెళ్లికి వెళ్లాలంటే కారో లేదా బ‌స్సుని బుక్ చేస్తాం..మ‌రీ దూరం అయితే ట్రైన్ లో వెళ్తాం..అయితే ఇక్క‌డ ఓ పెళ్లి కొడుకు త‌న పెళ్లికి వెళ్లేందుకు ఏకంగా విమానాన్నే బుక్ చేసి వార్త‌ల్లో నిలిచాడు. భువన్ అనే వ్యక్తి తన పెళ్లికి వెళ్లేందుకు తన కుటుంబం కోసం మొత్తం విమానాన్ని బుక్ చేశాడు. పెళ్లికి, తన బంధువులు విమానంలో ప్రయాణిస్తున్న వీడియో క్లిప్‌ను కూడా షేర్ చేశారు. దీంతో నెట్టింట్లో ఈ వీడియో వైరల్‌గా మారింది.ప్పుడు వైరల్ అవుతున్న వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లోని ది శుభ్ వెడ్డింగ్ అనే పేజీలో షేర్ చేయబడింది. చిన్న క్లిప్‌లో, భువన్ కుటుంబం, బంధువులు కెమెరా దగ్గర ఉత్సాహంగా చేతులు ఊపుతూ కనిపించారు. పెళ్లి ఇంటికి వెడుతున్నాం.. అని వీడియోకు క్యాప్షన్ పెట్టారు. భువన్ తన చేతులకు మెహందీతో ఉండడం కూడా క్లిప్‌లో కనిపిస్తుంది. వరుడు చాలా ఉత్సాహంగా.. వీడియో తీస్తున్న వారికి వెక్కిరింపుతో సరదా అయిన పోజులు ఇచ్చాడు.
ఆన్‌లైన్‌లో షేర్ చేయబడిన తర్వాత వీడియో మిలియన్లకొద్దీ వ్యూస్ వచ్చాయి. ఈ వీడియో మీద చాలామంది అనేకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. మీరు ధనవంతులని చెప్పకనే చెబుతున్నారు’అని ఒకరు కామెంట్ చేశారు. మరొకరు ‘జీవితంలో ఇన్ని డబ్బులు సంపాదిస్తే చాలు అంటూ కామెంట్ పెట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement